శ్రీ సత్య సాయి సేవా సమితి కన్వీనర్ నామప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం;; మానవసేవను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని శ్రీ సత్య సాయి సేవ సమితి కన్వీనర్ నామ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 380 మందికి రోగులకు, వారి సహాయకులకు భోజనపు ప్యాకెట్లను, వాటర్ ప్యాకెట్లను ఆసుపత్రి వైద్యులు, సిస్టర్ల చేతులు మీదుగా అందజేశారు. తదుపరి గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా స్వీట్లు కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సేవాదాతగా కీర్తిశేషులు చింత ఈశ్వరయ్య వారి కుటుంబ సభ్యులు వ్యవహరించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటువంటి సేవా కార్యక్రమాలకు ఆసక్తి కలవారు సెల్ నెంబర్ 99 66047044 కు గాని 9030444065కు గాని సంప్రదించాలని తెలిపారు.అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ మాధవి మాట్లాడుతూ శ్రీ సత్య సాయి సేవ సమితి గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు ఇటువంటి సేవా కార్యక్రమాలు నిజంగా హర్షించదగ్గ విషయం అని తెలిపారు. అనంతరం వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలియజేశారు.
మానవ సేవను ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలి..
RELATED ARTICLES