హెడ్మాస్టర్ బాలాంజినేయులు
విశాలాంధ్ర ధర్మవరం:: భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని హెడ్మాస్టర్ బాలాంజి నేయులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎస్బిఐ కాలనీలో గల శ్రీ నాగార్జున ఇంగ్లీష్ మీడియం పాఠశాల యందు సంక్రాంతి సంబరాలను విద్యార్థుల నడుమ ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించుకున్నారు. పాఠశాల విద్యార్థులచే ముగ్గుల పోటీలు, గాలిపటం తయారీ, చిన్నపిల్లలకు రాగి పండ్లతో భోగి స్నానాలు, భోగి మంటలు వేసి, భోగి మంటల చుట్టూ చిన్నారులతో నృత్య ప్రదర్శనలు జరిగిన తీరు అందరిని ఆకట్టుకున్నాయి. అనంతరం హెడ్మాస్టర్ సంక్రాంతి పండుగ విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, బోధ నేతల సిబ్బంది, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరు కాపాడుకోవాలి..
RELATED ARTICLES