హెడ్మాస్టర్ మేరీ వర కుమారి
విశాలాంధ్ర ధర్మవరం;! సావిత్రిబాయి పూలే ను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని ఆదర్శంగా నిలవాలని హెడ్మాస్టర్ మేరీ వర కుమారి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని కొత్తపేటలో గల పురపాలక బాలికల ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. అనంతరం మహిళ టీచర్లు చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వేదిక పైకి పూజారి రమేష్ హెడ్మాస్టర్ ను మహిళా ఉపాధ్యాయులందరినీ కూడా ఆహ్వానించి, వారిద్వారా మహిళ ఉపాధ్యాయురాల పాత్రను వారు వివరించడం జరిగింది. అనంతరం మహిళా ఉపాధ్యాయులు కూడా సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రను తెలుపుతూ, ఆమె చేసిన సేవలను కొనియాడారు. తదుపరి పాఠశాల విద్యార్థినీలు కూడా సావిత్రిబాయి చేసిన సేవలు గూర్చి మాట్లాడడం అందరిని ఆకట్టుకుంది. తదుపరి మహిళా ఉపాధ్యాయులందరినీ కూడా ఘనంగా సత్కరించారు. తదుపరి పాఠశాల హెడ్మాస్టర్ మేరీ వర కుమారి పురుష ఉపాధ్యాయులు ఈ కార్యక్రమం పెట్టడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
సావిత్రిబాయి పూలే ను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలి
RELATED ARTICLES