ఏపీయూడబ్ల్యూజే, రాజంపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం హర్షణీయం
ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి పల్లేటి రామ సుబ్బారెడ్డి
విశాలాంధ్ర -రాజంపేట: ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పాత్రికేయులకు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి పల్లేటి రామసుబ్బారెడ్డి అన్నారు. బుధవారం పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఏపీయూడబ్ల్యూజే, రాజంపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉరుకుల, పరుగుల జీవితంలో జర్నలిస్టులు ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో వృత్తి పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా వైద్య సేవలు చేయించు కోవాలన్నారు. ముఖ్యంగా పాత్రికేయుల సంక్షేమం కోసం హాస్పిటల్ సూపర్డెంట్ నాగేశ్వర్ రాజు ప్రతి ఆరు నెలలకు ఒకసారి వైద్య సేవలను అందించేందుకు ముందుకు రావడం అభినందించదగ్గ విషయం అన్నారు. పాత్రికేయులు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి సమస్యలను గుర్తించి ముందుగా వైద్యుల దృష్టికి తీసుకువెళ్లి వారికి కొంత సమయం ఇవ్వాలన్నారు. ఆ సమయంలో వారు పట్టించుకోకపోతే సమస్యలపై పత్రికలో రాయాలని కోరారు. వైద్యో నారాయణ హరి అనే సూక్తికి వైద్యులు కట్టుబడి ఉంటారన్నారు. ఎక్కడో కొంతమంది చేస్తున్న తప్పులను ఎత్తి చూపడం సరైనది కాదన్నారు. ముఖ్యంగా పాత్రికేయులు, వైద్యులు సన్నిహితంగా ఉంటే సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉండదన్నారు. దీంతోపాటు జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీం అమలు చేయడం జరిగిందన్నారు. ఈ పథకం ద్వారా అక్రిడేషన్ కార్డు కలిగిన ప్రతి జర్నలిస్ట్ ఏడాదికి 1250 రూపాయలు చెల్లిస్తే రెండు లక్షల వరకు వైద్య సేవలను పొందవచ్చు అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంతేకాకుండా జర్నలిస్టుల సమస్యలపై ఏపీయూడబ్ల్యూజే అలుపెరగని పోరాటాలను చేయడం జరుగుతుందన్నారు. అనంతరం సూపర్డెంట్ నాగేశ్వర్ రాజు మాట్లాడుతూ పాత్రికేయులు వృత్తి తో పాటు ఆరోగ్యంపై కూడా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇటీవల హాస్పిటల్ కు వచ్చిన కొంతమంది జర్నలిస్టుల రిపోర్టులను పరిశీలించడం జరిగింది అన్నారు. కొంతమేరకు రిపోర్టులు తేడాగా వచ్చాయన్నారు. వారి సంక్షేమం కోసం ఏపీయూడబ్ల్యూజే, రాజంపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. ఈ వైద్య శిబిరంలో జర్నలిస్టులకు గుండె, కిడ్నీలు, రక్త పరీక్షలు వీటితోపాటు మరికొన్ని పరీక్షలు నిర్వహించమన్నారు. చాలామందికి వారు చేసే వృత్తిలో ఒత్తిడికి గురవుతున్నట్లు రిపోర్టులు వచ్చాయన్నారు. వారి సంక్షేమం కోసం ప్రతి ఆరు నెలలకు ఒకసారి వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని జర్నలిస్టులకు హామీ ఇచ్చారు. అంతకుముందు వైద్య శిబిరానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర కార్యదర్శి రామ సుబ్బారెడ్డికి హాస్పిటల్స్ సూపర్డెంట్ శాలవాతో ఘనంగా సత్కరించారు. అడిగిన వెంటనే జర్నలిస్టులకు వైద్య శిబిరాన్ని నిర్వహించినందుకు ఏపీయూడబ్ల్యూజే, రాజంపేట ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపి శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఆర్ఎం డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ హబీబ్, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్, తాలూకా అధ్యక్షులు ఐసి వెంకటరెడ్డి, గౌరవ అధ్యక్షులు సుబ్బ నరసింహులు, ప్రధాన కార్యదర్శి మందా శివయ్య, ఉపాధ్యక్షులు శివయ్య నాయుడు, ఓబులేసు, కోశాధికారి సునీల్, ఏపీయూడబ్ల్యూజే జిల్లా సంయుక్త కార్యదర్శి తుపాకుల సురేష్ బాబు, జిల్లా సహాయ కార్యదర్శి కొత్తపల్లి గణేష్,జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కళ్యాణ్, తాలూకా కోశాధికారి పాలెంపల్లి కార్తీక్, జిల్లా కార్యవర్గ సభ్యులు మండ్ల శ్రీహరి, సీనియర్ జర్నలిస్టులు దార్ల శ్రీనివాస్ ఆచారి, మల్లికార్జున, జర్నలిస్టులు సురేంద్ర, ప్రశాంత్, డేవిడ్, ఇరువురి శివయ్య, మధు, నరసింహ, దుర్గయ్య, అనిల్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వైద్య శిబిరం విజయవంతం..
జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏపీయూడబ్ల్యూజే, రాజంపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో సూపర్డెంట్ నాగేశ్వర్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరం విజయవంతమైంది. ఈ వైద్య శిబిరంలో రాజంపేట, నందలూరు, పెనగలూరు, పుల్లంపేట, ఓబులవారిపల్లి, రైల్వే కోడూరు మండలాల నుండి వర్కింగ్ జర్నలిస్టులు సుమారు 100 మందికి పైగా వైద్య శిబిరంలో పాల్గొన్నారు. గుండె, కిడ్నీలు, షుగర్ వీటితోపాటు మరి కన్నిటికి వైద్య పరీక్షలు చేసుకుని వైద్యుల సూచనలు, సలహాలు తీసుకున్నారు.