Monday, April 21, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిబత్తలపల్లి మండలంలో ఎక్సైజ్ పోలీసులు దాడులు

బత్తలపల్లి మండలంలో ఎక్సైజ్ పోలీసులు దాడులు

ఎక్సైజ్ సీఐ. చంద్రమణి
విశాలాంధ్ర ధర్మవరం;; నియోజకవర్గ పరిధిలోని బత్తలపల్లి మండలం బి చెర్లోపల్లి క్రాస్ వద్ద ధర్మవరం ఎక్సైజ్ సీఐ. చంద్రమణి ఆధ్వర్యంలో మెరుపుదాడులను నిర్వహించారు. ఈ సందర్భంగా డివి చెర్లోపల్లి క్రాస్ వద్ద సారా కలిగి ఉన్న చిన్న కులాయప్ప నాయకులు అరెస్టు చేసి జైలుకు పంపించడం జరిగిందని సీఐ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ నాటు సారా కాయడము అమ్మడము చట్టరీత్యా నేరమని తెలిపారు. దీనికి జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ చాంద్ బాషా, సిబ్బంది ఓపిరెడ్డి, సుధాకర్ రెడ్డి, సునీత, చంద్ర ,రఘురాం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు