Saturday, May 10, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపోస్టుల మంజూరు పట్ల హర్షం.. యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయ చంద్రారెడ్డి

పోస్టుల మంజూరు పట్ల హర్షం.. యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయ చంద్రారెడ్డి

విశాలాంధ్ర ధర్మవరం: ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(యుటిఎఫ్) రాష్ట్ర శాఖ నిరంతర ప్రాతినిథ్యాలు, కృషి వల్ల నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ హై స్కూల్స్ లో సుమారు 1800 పోస్టులు హై స్కూల్ హెడ్ మాస్టర్స్, స్కూల్ అసిస్టెంట్స్ గా అప్గ్రేడ్ చేయడం జరిగిందని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్ర రెడ్డి పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలోని యుటిఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో ధర్మవరం మున్సిపల్ ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి, వారందరితో కలిసి కేక్ కట్ చేసి హర్షం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా నాయకులు రామకృష్ణ నాయక్, జిల్లా మునిసిపల్ సబ్ కమిటీ కన్వీనర్ బిల్లె రామాంజినేయులు, స్థానిక నాయకులు ఆంజనేయులు, లక్ష్మయ్య, అమర్ నారాయణరెడ్డి, సాయి గణేష్, రామాంజనేయులు, ఆదిశేషూ, హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు