Friday, April 25, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఉచిత గుండె వైద్య శిబిరమునకు విశేష స్పందన..

ఉచిత గుండె వైద్య శిబిరమునకు విశేష స్పందన..

డాక్టర్ రాజశేఖర్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర గల గడ్డి కోట హాస్పిటల్ లో శుక్రవారం జరిగిన మెగా ఉచిత కార్డియాకు (గుండె వైద్య శిబిరం) శిబిరమునకు విశేష స్పందన రావడం జరిగిందని హాస్పిటల్ అధినేత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్క్ హాట్ హాస్పిటల్ అనంతపురం వారి సహకారంతో ధర్మవరంలోనే మొట్టమొదటి క్యాంపు సందర్భంగా ఈ ఉచిత వైద్య శిబిరము నిర్వహించడం జరిగిందని తెలిపారు. క్యాంపు నందు ఉచితంగా బిపి, షుగర్, ఈసీజీ, అవసరమైన వారికి 2డి ఎకో పరీక్షలు, ఉచితముగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా డాక్టర్ ఫీజు కూడా ఉచితంగా నిర్వహించామని తెలిపారు. సీనియర్ గుండె వైద్య నిపుణులు డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, డాక్టర్ నాగరాజు లచే రోగులకు ఉచిత వైద్య చికిత్సలను అందించడం జరిగిందన్నారు. అంతేకాకుండా చాతిలో నొప్పి, గుండెనొప్పి, ఆయాసము, గుండె దడ, చేతులు, కాళ్లు , వేళ్ళు నల్లగా మారడం, కాళ్ళ వాపులు, నడిస్తే ఆయాసం, గుండెలో మంట, చమటలు పట్టడం, చిన్నపిల్లల గుండె సమస్యలను కూడా వైద్య చికిత్సలను అందించడం జరిగిందన్నారు. ఇకనుంచి ధర్మవరం ప్రజల కోరిక మేరకు ప్రతినెల నాలుగవ శుక్రవారం డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి చే గుండె వైద్య చికిత్సలను అందించబడునని తెలిపారు. ఈ శిబిరంలో 130 మందికి వైద్య చికిత్సలను అందించి, ఆరోగ్యములు పాటించాల్సిన బాధ్యతలను వివరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ నంద, గండికోట హాస్పిటల్, మార్పు హార్ట్ హాస్పిటల్స్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు