Friday, April 4, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన..

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన..

క్యాంపు కన్వీనర్ డాక్టర్ సత్య నిర్ధారన్
విశాలాంధ్ర ధర్మవరం:; మండల పరిధిలోని ధర్మపురి గ్రామంలో ఎంపీ యు పి పాఠశాల ఆవరణములో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరమునకు విశేష స్పందన రావడం పట్ల క్యాంపు కన్వీనర్ డాక్టర్ సత్య నిర్ధారన్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిబిరం యువర్స్ ఫౌండేషన్, రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందన్నారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ సాహిద్, డాక్టర్ మనోజ్ కుమార్, డాక్టర్ రమ్య, డాక్టర్ నాగరాజు 70 మందికి వైద్య చికిత్సలను అందిస్తూ ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా వివరించడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా హిమోగ్లోబిన్ రక్త పరీక్షలు, బిపి, షుగర్ వైద్య చికిత్సలను స్కంద హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచితంగా అందించడం జరిగిందన్నారు. అనంతరం వైద్యులను ఘనంగా సత్కరించడం జరిగిందన్నారు. ఈ శిబిరం విన్సెంట్ ఫెర్రర్ జ్ఞాపకార్థం నిర్వహించడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు విద్యార్థులు, ఉపాధ్యాయులు మొక్కలను అందజేయడం జరిగిందన్నారు. తదుపరి విద్యార్థులు చిత్ర ప్రదర్శనను తిలకించడం జరిగిందన్నారు. అదేవిధంగా మానసిక వికాసములో భాగంగా పిల్లలు గేయాలు కూడా పాడటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు, యువర్ ఫౌండేషన్ అధ్యక్షులు నాగేంద్ర, కౌన్సిలర్ కేత లోకేష్, మెహర్ బాబా నిర్వాహకురాలు సుజాత తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు