రెండు కుటుంబాల్లో వెలుగులు నింపిన నేత్ర దాత కునుతూరు చిన్న వెంకటరెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణములోని పోతుకుంట కి చెందిన కీ,శే కునుతూరు చిన్న వెంకటరెడ్డి (80 సం ) శనివారం మరణించగా పుట్టెడు దుర్ఖం లో ఉన్న కూడా విశ్వదీప సేవా సంఘం సభ్యులు నేత్రదానంపై అవగాహన కల్పించిన వెంటనే నేత్రధానం కి ఒప్పుకోవడం తో జిల్లా అందత్వ నివారణ సంస్థ అనంతపురం రెడ్ క్రాస్ సొసైటీ డివై కుల్లాయప్ప, కంటి రెట్రావైల్ సెంటర్ సహకారం తో టెక్నీషన్ జి. రాఘవేంద్ర కంటి కార్నియా సేకరించడం జరిగింది అని విశ్వదీప సేవా సంఘం వ్యవస్థాపకులు కోళ్లమోరం చంద్రశేఖర్ రెడ్డి ,అధ్యక్షులు గాజుల సురేష్, కార్యదర్శి జుజారు రఘు తెలిపారు . అనంతరం వారు మాట్లాడుతూ నేత్రదానానికి సహకరించిన దాత భార్య రామక్క, కుమారులు కునుతూరు కేశవరెడ్డి, వెంకటరెడ్డి, నరేంద్ర రెడ్డి కుమార్తెలు కేశమ్మ, రమాదేవి కోడళ్ళు వరలక్ష్మి, విజయ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి లకు సేవా సంఘం వారు కృతజ్ఞతలు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో గాజుల శేషు చంద్రశేఖర్ రెడ్డి మాధవ, ఆదినారాయణ తదితర సభ్యులు పాల్గొన్నారు. నేత్రదానం చేయువారు సెల్ నెంబర్ 9392323605 లేదా,9666629841 లేదా
9059017583 లేదా8247724335
9492323912 లేదా,9703126122 కు సంప్రదించవచ్చునని తెలిపారు.
నేత్ర దానంతో రెండు కుటుంబాల్లో వెలుగులు
- Advertisement -
RELATED ARTICLES


