విశాలాంధ్ర ధర్మవరం:: నేత్రదానముతో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపుతాయని విశ్వదేపా సేవా సంఘం సంస్థ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంస్థ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని చంద్రబాబు నగర్ లో కీర్తిశేషులు పామిశెట్టి గోపాల్ (61 సంవత్సరాలు) మృతి చెందడం జరిగింది. ఈ సందర్భంగా విశ్వ దీప సేవా సంఘం వారు మాట్లాడుతూ కుటుంబ సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించడంతో, కుటుంబ సభ్యుల అంగీకారమేరకు జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ డాక్టర్ కుళ్ళయప్ప ,కంటి వెల్ సెంటర్ టెక్నీషియన్ రాఘవేంద్ర నేత్రాలను సేకరించడం జరిగిందని తెలిపారు. నేత్రదానానికి సహకరించిన భార్య వెంకటలక్ష్మి ,కుమారుడు పామిశెట్టి వెంకట రమేష్, వెంకటేష్ ,అశోక్ ,కోడళ్ళు శివలక్ష్మి, నాగలక్ష్మి, తేజస్విని వారికి విశ్వదేవ సేవా సంఘం వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వదీప సేవా సంఘం వ్యవస్థాపకులు కోళ్ల మొరం చంద్రశేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షులు టి. చంద్రశేఖర్ రెడ్డి, మాధవ, రఘు, కేశవరెడ్డి, వెంకటేష్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
నేత్రదానంతో ఇద్దరి జీవితాల్లో వెలుగు నింపుతాయి.. విశ్వదీప సేవా సంఘం
RELATED ARTICLES