ఎన్డీఏ కార్యాలయ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం:: విద్యార్థులందరికీ చక్కటి ఆరోగ్యంతో పాటు, ఉచిత కంటి వైద్య చికిత్సలతో పాటు కంటి అద్దాలను నేటి ఎన్డీఏ ప్రభుత్వం పంపిణీ చేస్తుండడం విద్యార్థులకు వరంలాగా మారిందని ఎన్డీఏ కార్యాలయ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా బి ఎస్ ఆర్ మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో 156 మందికి హరీష్ బాబు, ఆర్డీవో మహేష్ చేతుల మీదుగా కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్వో సెల్వియా సల్మాన్, పాఠశాల హెడ్మాస్టర్లు రాంప్రసాద్, కంటి వైద్యులు ఉరుకుందప్ప, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గౌతమి, సిబ్బంది అన్న లక్ష్మీనారాయణ, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
156 మంది విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ..
RELATED ARTICLES