విశాలాంధ్ర -ధర్మవరం; పట్టణంలోని స్థానిక కే. హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులు విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ బి.గోపాల్ నాయక్, రాజనీతి శాస్త్ర అధ్యాపకులు , ఎస్. పావని, భౌతిక శాస్త అధ్యాపకురాలు, యుజిసి-మాలవ్య మిషన్ బోధనా శిక్షణ కార్యక్రమం, భారత ప్రభుత్వం అధ్వర్యంలో ఉత్తరాఖండ్ లోని ఐ.ఐ.టి. రూర్కీ లో జరిగిన ఐదు రోజుల కార్యక్రమానికి హాజరై వచ్చిన సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.ప్రభాకర్ రెడ్డి అధ్యాపకులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ జూన్ 28 నుండి జూలై 2 వరకు “భవిష్యత్ నాయకత్వాన్ని పెంపొందించడం” అనే అంశం జరిగిన కార్యక్రమానికీ ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఇద్దరు అధ్యాపకులు మాత్రమే ఎంపిక కావటం, శిక్షణ కార్యక్రమాన్ని పూర్తిచేసుకోని రావడం మా కళాశాలకు గర్వకారణమని కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.ప్రభాకర్ రెడ్డి తెలియచేసారు. ఈ కార్యక్రమo లో భవిష్యత్ నాయకత్వాన్ని పెంపొందించడంలో భాగంగా విద్య, ఉపాధి మరియు వ్యాపార, వాణిజ్య రంగాలలో యువత, విద్యార్థులకు ఎలా తర్ఫీదు ఇవ్వాలో వివిధ అంశాల విషయ నిపుణులతో తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఐ.ఐ.టి. రూర్కీ లో శిక్షణ పొందిందిన అధ్యాపకులు డా.బి.గోపాల్ నాయక్ , ఎస్.పావని లకు కాలేజీలో పనిచేస్తున్నా ఈతర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది , విద్యార్థులు శుభాకాంక్షలు తెలియచేసారు.
“ఐ.ఐ.టి. రూర్కీలో శిక్షణ తీసుకున్న కె.హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని అధ్యాపకులు”
- Advertisement -
RELATED ARTICLES


