Wednesday, December 4, 2024
Homeజిల్లాలుకర్నూలుభీమా పథకం కోసం రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలి

భీమా పథకం కోసం రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలి

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : రబీ సీజన్లో పంటలు వేసిన రైతులు భీమా పథకం కోసం రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలని మండల వ్యవసాయ అధికారి వరప్రసాద్ తెలిపారు. మంగళవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక రైతు సేవా కేంద్రం నందు రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రబీ సీజన్ నుండి పంటల భీమా కొరకు రైతులు ప్రీమియం చెల్లించాలని కోరారు. పంటల భీమా పథకం కింద అర్హత పొందడానికి శనగకు ఎకరానికి రూ 420, వరికి 630,జొన్నకు 297, వేరుశనగకు 480, ఉల్లికి 1350 రూపాయలు చొప్పున చెల్లిస్తే ప్రధాన మంత్రి ఫసల్ భీమా పథకం వర్తిస్తుందని, అలాగే టమోటాకు ఎకరానికి 1500 రూపాయలు చెల్లిస్తే వాతావరణ ఆధారిత భీమా కింద అర్హులు అవుతారని, రబీ సీజన్లో రుణాలు తీసుకునే రైతులకు బ్యాంకులే ప్రీమియం చెల్లిస్తాయని తెలిపారు. స్వచ్ఛందంగా నమోదు చేయదలుచుకున్న వారు బ్యాంకు లేదా కామన్ సర్వీసు కేంద్రాల్లో ప్రీమియం చెల్లించవచ్చునని, వరి పంటకు మాత్రం డిసెంబర్ 31లోగా ప్రీమియం చెల్లించాలని, మిగతా అన్ని పంటలకు డిసెంబర్ 15 లోపు ప్రీమియం చెల్లించి పంటల భీమా పథకంలో అర్హత సాధించాలని కోరారు. అలాగే గంజాయి లాంటి మాదక ద్రవ్యాల సాగుపై రైతులు మరియు రైతు సేవా కేంద్ర సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, కొంత మంది మిరప పంటలో గంజాయి మొక్కలు నాటే అవకాశం ఉందని, గంజాయి సాగు చట్ట విరుద్ధమని సాగు చేసిన రైతులు శిక్షార్హులని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఏఏ ఇందు, ఎంపీఈఓ శ్వేత, రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు