విశాలాంధ్ర -వలేటివారిపాలెం : పొలం పిలుస్తుంది కార్యక్రమం వలేటివారిపాలెం మండలంలోని వలేటివారిపాలెం మరియు అంక భూపాలపురం గ్రామంలో మండల వ్యవసాయ అధికారి ఎం హేమంత్ భరత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పంటల బీమా పథకం కు సంబంధించి టాటా ఏఐజి ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధి రామరాజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ పంటలకు భీమా చేయించుకోవడం వలన తుఫాన్లు, కరువు, అకాల వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట దిగుబడి నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందించటం జరుగుతుంది ఎంపిక చేసిన పంటలను సాగు చేస్తూ నిర్ణీత సమయంలో ప్రీమియం చెల్లించి నమోదు చేసుకున్న కవులు రైతుతో సహా రైతులందరికీ కూడా ఈ బీమా పథకం లో చేరటానికి అర్హులు. నెల్లూరు జిల్లాకి 5 పంటలుకు నోటిఫై చేయటం జరిగింది వాటి యొక్క ప్రీమియం వివరములు వరి ఎకరాకు 168 రూపాయిలు, మినుములు 38 రూపాయలు, శనగ పంటకు 56 రూపాయలు పెసర పంటకు 36 రూపాయలు వేరుశెనగకు 60 రూపాయలు ప్రీమియం చెల్లించినట్లయితే పంటల బీమా పథకం మనకు అర్హులవుతారు వరి కి తప్ప మిగిలిన అన్ని పంటలకు ఈనెల 15 డిసెంబర్ చివరి తేదీ వరికి మాత్రం 31 డిసెంబర్ చివరి తేదీ అని తెలియజేశారు ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ ఇన్సూరెన్స్ కట్టుకోదలిచిన రైతులు మీ సమీప గ్రామ సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ ద్వారా గాని కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్ సీ ) లో గానీ లేక పోస్ట్ ఆఫీసుల ద్వారా వారి యొక్క ఆధార్, భూమి పత్రము కౌలు రైతు అయితే కౌలు కార్డు, బ్యాంక్ పాసు పుస్తకం జిరాక్స్ మరియు వ్యవసాయ సహాయకుల ద్వారా ధృవీకరణ పత్రము సంబంధించిన పత్రములు సమర్పించి ఆన్లైన్ ద్వారా ప్రీమియం చెల్లించి తక్షణ రసీదు పొందవచ్చు బ్యాంకు నందు రుణం తీసుకున్న రైతులకు సూచించిన సేవింగ్స్ బ్యాంక్ ఖాతాకు పరిహారము ఆన్లైన్ ద్వారా జమ చేయడం జరుగుతుంది మీ గ్రామ సచివాలయం పరిధిలోని రైతు సేవ కేంద్రం లోని గ్రామ వ్యవసాయ మరియు ఉద్యానవన సహాయకులను సంప్రదించవలసినదిగా కోరడమైనది. ఈ కార్యక్రమంలో ఉద్యానవన సహాయకులు పి నాగరాజు మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.