విశాలాంధ్ర, ఉరవకొండ ( అనంతపురం జిల్లా) : ఆర్డిటి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు ఫాదర్ ఫెర్రర్ 105 వ జయంతి కార్యక్రమాన్ని బుధవారం ఉరవకొండలో జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఫాదర్ ఫెర్రర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జాయింట్ యాక్షన్ కమిటీ సమన్వయకర్త మీనుగ గోపాల్, చైర్మన్ సాకే భాస్కర్ మాట్లాడుతూ పేదల పాలిటి పెన్నిధి ప్రజల గుండెచప్పుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేద ప్రజల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన కృషివలుడు ఫాదర్ ఫెర్రర్ తన పుట్టిన స్పెయిన్ దేశాన్ని వదిలి ఎక్కడో మారుమూల అనంత జిల్లాకు వచ్చి ఎంతోమంది పేదల యొక్క అభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. విద్య, వైద్యం, గృహ నిర్మాణం, విద్యార్థుల యొక్క దశ దిశ ను మార్చి ఉద్యోగాల వైపు పరుగులు పెట్టించిన అలుపెరుగని యోధుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ మధు ప్రసాద్, ట్రెజరర్ దుర్గాప్రసాద్, రాజశేఖర్, కో -కన్వీనర్లు పృద్వి, పురుషోత్తం, లత్తవరం చంద్రశేఖర్, వై రాంపురం చెన్నప్ప, కోనాపురం ఎర్రిస్వామి, ఉరవకొండ యల్లన్న,హావలిగి నాగేష్ చక్రవర్తి కొత్తకోట వీరప్ప, హల్లెప్ప నాగేంద్ర సుంకప్ప మరెన్న,చిన్న ముస్తూరు ఎర్రిస్వామి పెద్ద ముస్తూరు పెద్ద ఓబులేసు చిన్ ఓబులేసు, రామాంజనేయులు నాగరాజు, మారెప్ప రాకేట్ల హనుమన్న, గుర్రం రామాంజినేయులు తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.
ఉరవకొండలో ఘనంగా ఫాదర్ ఫెర్రర్ జయంతి వేడుకలు
RELATED ARTICLES