ఆర్ డి టి సేవలను కొనసాగించాలి.. ఎస్ఎఫ్ఐ నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం; సేవా దృక్పథంతో 1969 లో మొదలైన గ్రామీణ రైతాంగ పేద బడుగు బలహీన వర్గాలకు అనునిత్యం వెంట ఉండి సేవలందించే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్ టి కు రావలసిన ఎఫ్ సి ఆర్ ఏ ను రద్దు చేయడం చాలా దారుణం అని ఎస్ఎఫ్ఐ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో సమావేశం నిర్వహించడం జరిగింది . అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నామాల నాగార్జున మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్డిటి సంస్థకు సంబంధించిన ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ రెన్యువల్స్ ను ఆపివేయడంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అనేకమంది పేద విద్యార్థులు, అనారోగ్య బారిన పడిన అనేకమంది నిరుపేదలు, స్వయం ఉపాధి కల్పిస్తూ, గ్రామీణ ప్రాంతంలో పేదలకు ఇల్లు నిర్మిస్తూ నీటి వనరుల చెక్ డాం నిర్మాణంలో కృషి, విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి చదువులకు దీటుగా చదివించడంలో విద్యార్థులను ఆటలు పోటీల్లో ముందుకు తీసుకు వెళ్తూ, ప్రతి సంవత్సరం ఉన్నత చదువుల కోసం ఆర్డిటి సెట్టు రూపంలో పేద విద్యార్థులకు ప్రైవేటు విద్యాసంస్థలలో ఉన్నత చదువులకు అవసరమైన కాంట్రిబ్యూషన్ భరిస్తూ అనేక మంది జీవితాలను అభివృద్ధి వైపు నడవడానికి అవకాశం కల్పిస్తున్న ఆర్ డి టి సంస్థ ఎఫ్ సి ఆర్ ఏ కు అనుమతులు నిలిపివేయడం చాలా దుర్మార్గమైన చర్య అని తెలిపారు. కావున పేదలకు రైతులకు ,విద్యార్థులకు ఉపయోగపడుతున్న ఆర్డిటి సంస్థకు సంబంధించిన ఎఫ్ సి ఆర్ ఏ కొనసాగించాలని ఆర్ డి టి సేవలను కొనసాగించేందుకు భవిష్యత్తులో అందరినీ ఐక్యం చేసి కార్యక్రమాలు నిర్వహించేందుకు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు అనిల్ కుమార్ పట్టణ అధ్యక్షులు అమన్, పట్టణ ఉపాధ్యక్షుడు హరి పాల్గొన్నారు
ఎఫ్ సి ఆర్ ఏను పునరుద్ధరించాలి
RELATED ARTICLES