విశాలాంధ్ర -అనంతపురం : డీఎంహెచ్ఓ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఈ బి దేవి ఆధ్వర్యంలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టం, డిస్టిక్ లెవెల్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిటీ పలు తీర్మానాలు చేయడం జరిగినది.
ముఖ్యంగా గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టం , జిల్లాలో పగడ్బందీగా అమలుపరిచే విధంగా యంత్రాంగం పలు చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా ఈ చట్టంపై ప్రజలకు వివిధ మాధ్యమాల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. ఆడపిల్లల యొక్క ప్రాముఖ్యతను తెలియపరచాలని రైల్వే స్టేషన్లో ,బస్టాండ్ లో మొదలగు జన సంచార ప్రదేశాలలో ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ లు ఏర్పాటు చేయాలని అలాగే సచివాలయం ,అంగన్వాడి కేంద్రాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని తీర్మానించారు.ఇంటర్ స్టేట్ కర్ణాటక సరిహద్దు జిల్లాల అధికారులతో, కోఆర్డినేషన్ మీటింగ్ జరపాలని తద్ ద్వారా అన్ని ప్రాంతాలలో లింగ నిర్ధారణ జరగ కుండ తగు చర్యలు చెప్పట్టాలని సూచించారు. ప్రతి ప్రభుత్వ,మరియు ప్రైవేటు ఆసుపత్రులలో ఈ చట్టం ఫై అవగాహన కోసం బోర్డ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. జూనియర్ కళాశాలలో పాఠశాలలో కూడా వైద్య సిబ్బంది ఈ చట్టం పై అవగాహన కల్పించాలని అన్నారు.
స్కానింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసినటువంటి ఆసుపత్రి యాజమాన్యం. డాక్టర్స్ ఎట్టి పరిస్థితులలోనూ లింగ నిర్ధారణ పరీక్షలు జరపకూడదని చట్టం అతిక్రమించినచో చర్యలు తీసుకుంటామన్నారు. లింగ నిర్ధారణ కోసం ప్రయత్నించిన, లేదా ప్రోత్సహించిన అట్టి వారిపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సమావేశం లోcప్రోగ్రాం అధికారులు డా సుజాత, డా యుగంధర్, డా అనుపమ, డా రవిశంకర్, సర్వజన ఆస్పత్రి చిన్నపిల్లల నిపుణులు డా రవికుమార్, స్త్రీ విభాగం నిపుణులు డా నిస్సార్ బేగం,,, డా ప్రసన్న భారతి, పేతాలజిస్ట్, డా లక్ష్మి ,డిపిఆర్ఓ గురుమూర్తి, డెమో, త్యాగరాజ్, డిప్యూటీ హెఛ్ ఈ ఓ గంగాధర్, ఐసిడిఎస్, సి డి పి ఓ వెంకట కుమారి, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు , ఆర్డిటి డాక్టర్ దుర్గేష్, రెడ్స్ అనిత, హెడ్స్ రామ్మోహన్, ఆరోగ్య బోధకులు వేణు, వెంకటేష్, శ్రీకాంత్, లీగల్ అడ్వైజర్ , ఆషారాణి, తదితరులు పాల్గొన్నారు,