అందించిన తొగట వీర క్షత్రియ కళ్యాణ మండపం అభివృద్ధి సంఘం కమిటీ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని తొగటవీర క్షత్రియ కు చెందిన వేల్పుల నీలకంఠుడు కుమార్తె వేల్పుల జాహ్నవి ఎంబీబీఎస్ కర్నూలులో చదువును కొనసాగిస్తోంది. చదువుకు అవసరమైన ఆర్థిక సహాయం కొరకు శ్రీ చౌడేశ్వరి దేవి తొగటవీర క్షత్రియ కళ్యాణ మండపం అభివృద్ధి సంఘం తరఫున విద్యార్థి జాహ్నవి కు 80 వేల రూపాయల నగదును ఆర్థిక సహాయం కింద అందజేయడం జరిగిందని ఉపాధ్యక్షుడు బండారు ఆదినారాయణ, కార్యదర్శి పూజారి నారాయణ, అధ్యక్షులు మేకల అశ్వత్ నారాయణ, కోశాధికారి మధ్యన లక్ష్మీ నరసింహులు, ఉపాధ్యక్షులు బండారు ఆదినారాయణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువును మరింత ప్రోత్సహించేందుకే ఈ నగదును సహాయం చేయడం జరిగిందని, చదువుకు పేదరికం అడ్డుకాకూడదన్న ఉద్దేశంతోనే తాము ఈ సేవను చేయడం జరిగిందని తెలిపారు. మున్ముందు తొగటవీర క్షత్రియ కులస్తులకు మరింత సేవా కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. అనంతరం జాహ్నవి తండ్రి వారి కుటుంబ సభ్యులు సంఘమునకు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు బంధనాథం ప్రకాష్, రత్నం లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఎంబీబీఎస్ విద్యార్థినీకి ఆర్థిక సహాయం
RELATED ARTICLES