బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు జింకా చంద్రశేఖర్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని 39 వార్డులో గల పూజారి శ్రీనివాసులు కిడ్నీ వ్యాధితో మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు జింకా చంద్రశేఖర్ స్వయంగా వారి ఇంటికి వెళ్లి, కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆరువేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. మీ కుటుంబానికి అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు దాము, రాజు, మల్లికార్జున ,రామకృష్ణ, షీలా గంగా ప్రసాద్, భాస్కర, గడ్డం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం చేయుత..
RELATED ARTICLES