విశాలాంధ్ర -ధర్మవరం ;ధర్మవరం మండలం పోతుకుంట గ్రామంలోని ఎస్సీ కాలనీ చెందిన సాకే. కాశీ నాథ్ (55).అనే వక్తి బేల్దారి పని చేస్తూ జీవనవం కొనసాగించేవారు.గత కొద్ది రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ మరణించాడు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్య కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు అంగజాల నాగవేణి సర్పంచ్.భర్త అంగజాల రాజశేఖర్ (రాజు)గారు అంత్యక్రియల కార్యక్రమం కోసం 5000 ఆర్థిక సహాయం చేసి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా నిలుస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాకే. చంద్ర మహేష్,పైటే లక్ష్మి నారాయణ,నులక రాము, కృష్ణ,రామాంజనేయులు, ప్రసాద్,రామంజి,హరి,సాయి, కృష్ణ,మూర్తి,అంజి,నరసింహ మూర్తి పాల్గొన్నారు.