Wednesday, April 2, 2025
Homeజిల్లాలుపశ్చిమ గోదావరిభవన నిర్మాణ కార్మికుని కుటుంబానికి ఆర్థిక సహాయం!

భవన నిర్మాణ కార్మికుని కుటుంబానికి ఆర్థిక సహాయం!

విశాలాంధ్ర –తాడేపల్లిగూడెం రూరల్ : ఇటీవల మృతిచెందిన భవననిర్మాణ కార్మికుని కుటుంబానికి నలభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందచేసినట్లు గోదావరి భవన నిర్మాణ కార్మికసంఘం ఏఐటీయూసీ నాయకులు మంగళవారం తెలిపారు. జగ్గన్నపేట గ్రామానికి చెందిన యువకుడు దూలపల్లి రాజు ఇటీవల గృహనిర్మాణ పనికి కూలీగా ఒకరోజు వెళ్ళారు. అదేరోజు పనిలో ఉండగానే గుండెపోటుకు గురై కన్నుమూశారు. అతనికి తల్లి తండ్రులు లేరు. అవివాహితుడు. సోదరి గల్ఫ్ దేశంలో ఉపాధికోసం వెళ్ళారు. స్థానికంగా మేనల్లుళ్లు మాత్రం ఉన్నారు. భవననిర్మాణ కార్మికసంఘం, ఎఐటీయూసీ నాయకులు పడాల శ్రీనివాస్ , పోలిరాతి ఆదినారాయణ తదితరుల కృషితో కుటుంబ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఇంటి యజమాని దుట్టా వెంకటరాజు 25 వేల రూపాయలు, శాసనసభ్యులు , ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ 10 వేల రూపాయలు, తోటి కార్మికులు 5 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందచేసారు.నలభై వేల రూపాయల మొత్తాన్ని మంగళవారం జగ్గన్న పేట గ్రామంలో దూలపల్లి రాజు మేనల్లుడు కూనపాముల నానీ కి అందచేసారు.ఈ కార్యక్రమంలో జిల్లా భవననిర్మాణ కార్మికసంఘం , ఏఐటీయూసీ కార్యదర్శి పోలిరాతి ఆదినారాయణ , జిల్లా కార్యవర్గ సభ్యుడు కోడె సాయి బాలాజీ, గోదావరి గ్రామీణ భవననిర్మాణ కార్మికసంఘం జగ్గన్నపేట గ్రామ కమిటీ అధ్యక్షుడు కంకిపాటి రాజు , కార్యదర్శి గాడి లోవరాజు సభ్యులు పలివెల వెంకట్రావు చీలి నాగరాజు, కూనపాముల సుధీర్ , నాని రామారావు , గణేష్ , మంచాల సాయి శివ , చీలి రాజు, చీలి శంకరం , కూన పాముల పురుషోత్తం పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు