Thursday, February 27, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిసామూహిక కార్యకలాపాల కోసం గ్రూపుకు ఆర్థిక సహాయం..

సామూహిక కార్యకలాపాల కోసం గ్రూపుకు ఆర్థిక సహాయం..

ఎంపీడీవో సాయి మనోహర్
విశాలాంధ్ర ధర్మవరం:: మండల పరిధిలోని మేదర, కుమ్మరి, శాలివాహన కులాల కు సంబంధించిన సామూహిక కార్యకలాపాల కోసం మూడు నుండి ఐదు మంది సభ్యులతో కూడిన గ్రూపులకు ఆర్థిక సహాయమును అందించడం జరుగుతుందని ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి గ్రూపుకు ఏపీ బి సి సి ఎఫ్ సి నుండి సహాయ భారం (50 శాతము) రూ.1,50,000, బ్యాంకుల నుండి అప్పు (50 శాతం) రూ.1,50,000, యూనిట్ ఖర్చు 3 నుండి 5 మంది సభ్యులతో కూడిన గ్రూపులకు మూడు లక్షల రూపాయలు, మేదర, కుమ్మరి శాలివాహన కులముల వారికి గ్రూపుగా మూడు నుండి ఐదు మందితో వెబ్సైట్ నందు సబ్సిడీ రుణముల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చని వారు తెలిపారు. ఈ నెల 12వ తేదీ నుండి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వారు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు