వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద ఇటీవల జరిగిన అగ్ని ప్రమాద ఘటనను పోలీస్ యంత్రాంగం సీరియస్గా తీసుకుంది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు మరోసారి వైసీపీకి నోటీసులు జారీ చేశారు. సీసీటీవీ పుటేజీ ఇవ్వాలని రెండు రోజుల క్రితం ఆ పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తికి నోటీసులు ఇవ్వగా, తమ వద్ద ఎలాంటి సీసీటీవీ పుటేజీ లేదని పోలీసులకు నారాయణమూర్తి సమాచారం ఇచ్చారు. దీనిపై సంతృప్తి చెందని తాడేపల్లి పోలీసులు మరోసారి మంగళవారం నోటీసులు ఇచ్చారు. వ్యక్తిగతంగా హాజరై సీసీ కెమెరాల వివరాలు ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.
జగన్ నివాసం ఎదుట అగ్నిప్రమాదాలు… సీసీటీవీ ఫుటేజి ఇవ్వాల్సిందేనంటున్న పోలీసులు
RELATED ARTICLES