అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అడవి పరిసరాల్లో భద్రతా దళాలు,మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.ఈ సంఘటనలో ఆరుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.
మరణించిన వారిలో మావోయిస్టుల కీలక నాయకుడు, కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా కూడా ఉన్నట్టు అధికారులు ధృవీకరించారు.ప్రస్తుతం ఆ ప్రాంతంలో భద్రతా దళాలు తీవ్రంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.
ఛత్తీస్‌గఢ్‌లో మరో ఘటన
ఇదే సమయంలో ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో కూడా సమాన పరిస్థితి ఏర్పడింది.
మంగళవారం ఉదయం ఎర్రబోరు ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాలు ఒకరిపై ఒకరు కాల్పులు జరిపారు.ఈ ఘటనలో ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఇంకా ఆ ప్రాంతంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ వెల్లడించారు.


