Saturday, February 22, 2025
Homeజిల్లాలుఅనంతపురంసూపర్ సిక్స్ అమలుపై ధ్యాస పెట్టండి

సూపర్ సిక్స్ అమలుపై ధ్యాస పెట్టండి

పేదలకు ఇండ్ల నిర్మాణాన్ని త్వరలో చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి సి. జాఫర్

విశాలాంధ్ర -అనంతపురం : సూపర్ సిక్స్ అమలుపై ధ్యాస పెట్టాలని,పేదలకు ఇండ్ల నిర్మాణాన్ని త్వరలో చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యే సీట్లు మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అన్నింటిని నెరవేర్చకుండా కాలయాపన చేయడం ఆందోళన కలిగిస్తోందన్నారు. సూపర్ సిక్స్ హామీల అమలు పై దృష్టి పెట్టాలన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి అర్హులైన పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణాన్ని త్వరలో చేపట్టాలన్నారు. ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షల బదులు ఐరన్ సిమెంటు, ధరలు పెరగడంతో రూ. 5 లక్షలు ఇవ్వాలన్నారు. అనంతపురం జిల్లాలో పంట నష్టపరిహారం అంచనా వేసి రైతులకు పరిహారం త్వరలో అందించాలన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు కావస్తున్న రైతులకు పెట్టుబడి సాయం కింద సహాయం, విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద అందించే లబ్ధి పై కాలయాపన చేస్తున్నారన్నారు. జిల్లాలో ముఖ్యంగా హంద్రీనీవా కాలవను వెడల్పు చేయాలన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు వంతు పాడుతుందన్నారు. అమెరికాలో ఎఫ్బి ఐ నమోదు చేసిన కేసులో ఆదాని, జగన్ లంచం వ్యవహారం బయటపడిందని రూ.1,750 కోట్ల లంచం తీసుకుని ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ సంస్కరణలు అమలు చేయడానికి జగన్ చేసిన నిర్వాకాన్ని మోది వెనకేసుకు రావడం చూస్తుంటే ఆదానికి, మోదీ బినామీ అని తెలుస్తోందన్నారు. 25 సంవత్సరాల పాటు ప్రజల్ని విద్యుత్ ఛార్జీల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. దేశంలో, రాష్ట్రంలో పరిపాలనలో సాగుతున్న కూటమి ప్రభుత్వం ప్రజలను దృష్టిలో పెట్టుకొని పాలించాలన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు