విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలో రజిని ట్రస్టు .రక్త బంధం ట్రస్ట్ ఆధ్వర్యంలో మోహన్ సహకారం తో ధర్మవరం రైల్వే స్టేషన్ చుట్టుపక్కల నిరాశ యాత్రీకులకు అన్నదానము చేయడం జరిగింది అని కన్నా వెంకటేష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అభాగ్యులకు అన్నదానంచేయడం గొప్పదానం ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది అని తెలిపారు. మన ఇంట్లో లో జరిగే ఫంక్షన్లకు కానీ .వర్ధంతి కానీ మనకు ఉన్నదాంట్లో కొంతైనా పేదవారికి పంచడం చాలా సంతోషకరమని తెలియజేశారు. అన్నదానము, రక్తదానం చేయాలనుకున్నవాళ్లు 9391553146.9731135903 ఫోన్ నెంబర్ సంప్రదించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు ఉదయ్ కుమారు, జయ ప్రకాష్, శంకర, తదితరులు పాల్గొన్నారు.
అభాగ్యలకు అన్న వితరణ కార్యక్రమం : రజిని ట్రస్టు & రక్త బంధం
RELATED ARTICLES