Homeఆంధ్రప్రదేశ్ఏ సి ఏ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ గా బాధ్యతలు స్వీకరించిన మాజీ ఐపీఎల్...

ఏ సి ఏ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ గా బాధ్యతలు స్వీకరించిన మాజీ ఐపీఎల్ ఆటగాడు కళ్యాణ్ కృష్ణ

- Advertisement -
  • సుదీర్ఘకాలంగా ఆంధ్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించిన కళ్యాణ్ కృష్ణ
  • ఆంధ్ర క్రికెట్ జట్టును దేశంలో నెంబర్ వన్ చేయడమే లక్ష్యంగా సన్నాహాలు చేస్తున్న ఏసీఏ

విశాలాంధ్ర – విజయవాడ స్పోర్ట్స్ : విజయవాడ( ఏ సి ఏ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం) విజయవాడ లోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో నేడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుండి డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ గా మాజీ ఐపీఎల్ ఆటగాడు సుదీర్ఘకాలం ఆంధ్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించిన దొడ్డపనేని కళ్యాణ్ కృష్ణ బాధ్యతలు తీసుకున్నారు.ఈ సందర్భంగా కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ ముందుగా తనకు ఇంత గొప్ప బాధ్యతను ఇచ్చిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు కృతజ్ఞతలు తెలిపారు మరి ముఖ్యంగా ఏ సి ఏ అధ్యక్షుడు కేశినేని శివనాద్ (చిన్ని), కార్యదర్శి సానా సతీష్ బాబు ట్రెజరర్ దండమూడి శ్రీనివాస్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సుదీర్ఘకాలం ఆంధ్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించడo. దాదాపు 2001నుండి 2011 వరకు ఆంధ్ర జట్టుకు ఆడడమే కాకుండా ప్రస్తుతం దేశంలోనే ప్రధాన క్రికెట్ లీగ్లలో ఒకటైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ సీజన్లో 2008, 09 ఆడిన అనుభవం దులీప్ ట్రోఫీ మరియు దియోధర్ ట్రోఫీ ఆరు సీజన్లపాటు ఆడడమే కాకుండా ఆంధ్ర క్రికెట్కు బౌలింగ్ కోచ్ గా గతంలో సేవల అందించిన అనుభవం కూడా తనకి ఉందని తెలియజేశారు, ప్రస్తుతం 2015నుండి నేటి వరకు జియో హాట్ స్టార్ మరియు సోనీ నెట్వర్క్ ల లో ఉన్నప్పటికీ ఆంధ్ర క్రికెట్కు సేవలందించిన నాకు మరొకసారి అదే ఆంధ్ర జట్టుకు ఎంతో మంది ప్రతిభ గల క్రీడాకారులను తయారు చేసే అవకాశం వచ్చిందని ఈ అవకాశం ద్వారా ఆంధ్ర క్రికెట్ నుండి ఎక్కువమంది ఆటగాళ్లను ఐపిఎల్ మరియు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే విధంగా ముందుకు నడిపిస్తానని తెలియజేశారు. ముఖ్యంగా గేమ్ డెవలప్మెంట్, ప్రమోషన్, ఆటగాళ్ల సౌకర్యాలు సెలక్షన్ మరియు కోచింగ్ లపై ప్రత్యేక దృష్టి సాధిస్తానని అన్నారు ముఖ్యంగా గత నెలలో జరిగిన ఏపీఎల్ ఐపీఎల్ కు ఏమాత్రం తీసిపోని విధంగా జరిగిందో అందులో పాల్గొన్న ప్రతి జట్టులోని క్రీడాకారుల ప్రదర్శన చాలా అత్యద్భుతంగా ఉందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అత్యద్భుతమైన సహకారంతో స్టేడియంల రూపకల్పన, మెరుగైన సౌకర్యాలు, ఆటగాళ్లకు కావలసిన అన్ని అవసరాలు ఏర్పాటు చేయడంతో ఏపీఎల్ లాంటి లీగ్ చాలా అత్యద్భుతంగా జరిగిందని ఇలాంటి లీగ్స్ జరిగితే ఎందరో ప్రతిభగల క్రీడాకారులు బయటకు వచ్చే అవకాశం ఉందని వారికి మెరుగైన అవకాశాలు కల్పించడమే కాకుండా ఆంధ్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించే సీనియర్స్ మరియు జూనియర్స్ జట్లను మెరుగ్గా రాణించే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని వివరించారు ఆంధ్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తనకు ఆంధ్ర జట్టు కు ఎంతోమంది యువతను తయారుచేసే అవకాశం ఇచ్చినందుకు మరోసారి ఏసీఏ అధ్యక్ష కార్యదర్శులకు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు