Friday, April 25, 2025
Homeజాతీయంఇస్రో మాజీ ఛైర్మ‌న్ క‌స్తూరి రంగ‌న్ క‌న్నుమూత‌

ఇస్రో మాజీ ఛైర్మ‌న్ క‌స్తూరి రంగ‌న్ క‌న్నుమూత‌

ఇస్రో మాజీ ఛైర్మ‌న్ డాక్టర్ కృష్ణ‌స్వామి కస్తూరి రంగన్ (84) కన్నుమూశారు. ఆయన బెంగళూరులో తన నివాసంలో ఈరోజు ఉద‌యం తుదిశ్వాస విడిచారు. కస్తూరి రంగన్ గతంలో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) ఛాన్సలర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అలాగే కర్ణాటక నాలెడ్జ్ కమిషన్ ఛైర్మన్‌గా కూడా పని చేశారు. అంతేగాక‌ 1994 నుంచి 2003 వరకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఛైర్మన్‌గా ఆయన కీలక పాత్ర పోషించారు. అనంతరం 2003 నుంచి 2009 వరకు ఆయన రాజ్యసభ సభ్యుడిగానూ ఉన్నారు. అలాగే మోదీ ప్రభుత్వం రూపొందించిన నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదాను తయారు చేసిన కమిటీకి కస్తూరి రంగన్ అధ్యక్షత వహించారు.

2004 నుంచి 2009 మధ్యకాలంలో బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ (చీIAూ)కు డైరెక్టర్‌గా ఆయన పనిచేశారు. ఈ సంస్థ ద్వారా దేశం యొక్క శాస్త్రీయ, సాంకేతిక అభివృద్ధికి కస్తూరి రంగన్ తోడ్పాటు అందించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు