Homeజిల్లాలుకర్నూలుమృతుని కుటుంబానికి మాజీ సర్పంచ్ ఆర్థిక సహాయం

మృతుని కుటుంబానికి మాజీ సర్పంచ్ ఆర్థిక సహాయం

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని జాలవాడి గ్రామానికి చెందిన ఈరన్న అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న జాలవాడి మాజీ సర్పంచ్ రామన్న సోమవారం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం తన వంతు సహాయంగా 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి గ్రామ అధ్యక్షులు వెంకన్న, అబ్బిలి భీరలింగేష్, ఉలిగప్ప, చిన్న లక్ష్మన్న, భీమేష్, చిన్న భీమేష్, పెద్ద భీమేష్, తాయన్న, రమేష్, ఓంకార్, కాసిం, మల్లేష్, వీరనాగుడు, రంగన్న, ఫీల్డ్ అసిస్టెంట్ శాంతప్ప తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు