సర్పంచుల పోస్టు కార్డు ఉద్యమం
విశాలాంధ్ర – ఆమనగల్లు: తెలంగాణ వ్యాప్తంగా గ్రామపంచాయతీలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, దేశంలోనే తెలంగాణ పల్లెలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దితే ప్రభుత్వం సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేయకుండా 16 నెలలుగా సర్పంచులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తోందని సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి అన్నారు.శుక్రవారం రాష్ట్ర స్థాయి పోస్టు కార్డు ఉద్యమాన్ని రంగారెడ్డి జిల్లా, కడ్తాల్ మండల కేంద్రంలో పోస్టాఫీసు దగ్గర సర్పంచులతో కలిసి ముఖ్యమంత్రికి పెండిగు బిల్లులు చెల్లించాలని పోస్టు కార్డులు పంపారు.అనేక నిరసనలు,ఉద్యమాలు చేసినా ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి, సర్పంచులను పట్టించుకోక ఆర్థికంగా కుదేలు చేసిందని ద్వెజమెత్తారు..ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సర్పంచుల పెండింగు బిల్లులు చెల్లించాలని సర్పంచుల పోస్టుకార్డు ఉద్యమం నకు రాష్ట్ర కార్యవర్గం శ్రీకారం చుట్టిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు.శాంతి యుతంగా చేస్తున్న నిరసన కార్యక్రమాలను పోలీసు వారిచే అణిచివేయడం తగదన్నారు.అక్రమ అరెస్టులకు నిరసనగా పోస్టు కార్డు ద్వారా సర్పంచుల యొక్క గోస ముఖ్యమంత్రికి తెలియజేయడమే లక్ష్యంగా సర్పంచులందరూ పాల్గొన్నట్లు తెలిపారు. అందాల పోటీల కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్న ఈ ప్రభుత్వం సర్పంచుల పెండింగు బిల్లులు ఎందుకు విడుదల చేయడం లేదని అడిగారు.హంగులు,ఆర్భాటాలకు, ప్రకటనల ద్వారా ప్రజాధనాన్ని వృధాచేస్తున్నారని,ఆదర్శవంతంగా గ్రామాలను తీర్చిదిద్దిన సర్పంచులను అరెస్టు చేస్తున్నారని ప్రభుత్వంపైధ్వజమెత్తారు.ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడి తెలంగాణ సర్పంచుల పెండింగు బిల్లులు వెంటనే విడుదల చేయలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉదృతం చేసి రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిస్తామనిహెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మన్ వెంకటేష్ గుప్తా,మాజీ సర్పంచులు తులసిరామ్ నాయక్,నక్కపోతు యాదయ్య,భాగ్యమ్మ జంగయ్య,లోక్యా నాయక్,సులోచనా సాయిలు,హరిచంద్ నాయక్ మాజీ ఎంపీటీసీలు మంజులా చంద్రమౌళి,రైతు కోఆర్డినేటర్ జోగు వీరయ్య,మంగలపల్లి నర్సింహ్మ,ఉపసర్పంచులు రామకృష్ణ,వినోద్,మార్కెట్ డైరెక్టర్ లాయక్ అలీ,గోపాల్ గౌడ్,గురిగళ్ల రామచంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.