అమెరికా మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి గ్రహీత జిమ్మీ కార్టర్ (100) కన్నుమూశారు. కార్టర్ జార్జియాలోని ప్లెయిన్స్‌లో ఉన్న తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కార్టర్ ఫౌండేషన్ తెలిపింది. కాగా, ఆయన 1977 నుంచి 1981 వరకు యూఎస్‌కి 39వ అధ్యక్షుడిగా పనిచేశారు.ఁనా తండ్రి నాకు మాత్రమే కాదు, శాంతి, మానవ హక్కులు, నిస్వార్థ ప్రేమను విశ్వసించే ప్రతి ఒక్కరికీ హీరోఁ అని ఆయన కుమారుడు చిప్ కార్టర్ తెలిపారు. 1924 అక్టోబర్ 1న జన్మించిన జిమ్మీ కార్టర్.. ఈ ఏడాది తన వందో బర్త్‌డేను ఘనంగా జరుపుకున్నారు. ఇక ఆయన యూఎస్ అధ్యక్షుడిగా పనిచేసి, వందేళ్లు జీవించిన వ్యక్తిగానూ నిలిచారు. అధ్యక్షుడిగా తన సింగిల్ టర్మ్‌లో మానవ హక్కులు, సామాజిక న్యాయం వంటి అంశాలపై కార్టర్ నిబద్ధతతో ఉన్నారు. ఇజ్రాయెల్-ఈజిప్ట్ మధ్య క్యాంప్ డేవిడ్ అకార్డ్స్ అని పిలిచే శాంతి ఒప్పందం ఏర్పడడంలో మధ్యవర్తిత్వం వహించారు. ఇక 1980లో ఆయన పదవీకాలంలో ఇరాన్‌లో బందీగా ఉన్న 52 మంది అమెరికన్లను విడిపించడంలో విఫలయత్నం అనేది మాయనిమచ్చగా మిగిలిపోయింది. అదే ఏడాది నవంబరులో రిపబ్లికన్ పార్టీకి చెందిన రోనాల్డ్ రీగన్ ఎన్నికలలో కార్టర్‌ను ఓడించారు. అధ్యకుడిగా దిగిపోయిన తర్వాత 1982లో ఃకార్టర్ సెంటర్‌ఃను స్థాపించారాయన. సామాజిక, ఆర్థిక న్యాయాన్ని ప్రోత్సహించడానికి అవిశ్రాంతంగా శ్రమించిన కార్టర్‌కు 2002 నోబెల్ శాంతి బహుమతి వరించింది. న్యాయం, ప్రేమ వంటి ప్రాథమిక క్రైస్తవ సిద్ధాంతాలు తన అధ్యక్ష పదవికి పునాదిగా నిలిచాయని పలు సందర్భాల్లో ఆయన చెప్పారు. నేవీ ఉద్యోగిగా, గవర్నర్‌గా, అధ్యక్షుడిగా అన్నింటికీ మించి ఓ మానవతావాదిగా ప్రంపచానికి జిమ్మీ కార్టర్ సుపరిచితులు. కాగా, ఆయన భార్య రోసలిన్ (96) 2023 నవంబర్ 19న మరణించారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి గ్రహీత జిమ్మీ కార్టర్ మృతి..
RELATED ARTICLES