ఉమ్మడి జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సేట్టిపి జయ చంద్రారెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం ; పట్టణంలోని ధర్మాంబా బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మే ఒకటో తేదీ, గురువారం నుండి నెల రోజులపాటు స్థానిక కాలేజీ గ్రౌండ్ బాస్కెట్బాల్ క్రీడా మైదానంలో వేసవి శిక్షణ శిబిరం ఉచితంగా నిర్వహించబడునని ఉమ్మడి జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ శెట్టిపి జయచంద్రారెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిక్షణ శిబిరం ఉదయం, సాయంత్రం రెండు పూటలా నిర్వహించబడునని, జిల్లా క్రీడా సాధికారక సంస్థ, ఆత్మీయ ట్రస్ట్ సౌజన్యంతో జరిగే ఈ వేసవి శిక్షణ శిబిరం విద్యార్థినీ, విద్యార్థులు సద్వినియోగపర్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు మేడాపురం రామిరెడ్డి, సెక్రటరీ వాయల్పాడు హిదయతుల్లా, కోచ్ సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వివరాలకు 9030944717 , 9391710032 నెంబర్ల ద్వారా సంప్రదించాలని తెలిపారు.
ఉచిత బాస్కెట్బాల్ వేసవి శిక్షణ శిబిరం..
RELATED ARTICLES