Friday, April 18, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఉచిత రక్త గ్రూపు నిర్ధారణ,రక్తపోటు పరీక్షల శిబిరం

ఉచిత రక్త గ్రూపు నిర్ధారణ,రక్తపోటు పరీక్షల శిబిరం

క్యాంపు నిర్వహకులు బీరే శ్రీరాములు
విశాలాంధ్ర ధర్మవరం: పట్టణం లో శ్రీ చౌడేశ్వరి సేవా సమితి , జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్ యూనిట్) సంయుక్తంగా “రక్త గ్రూప్ నిర్ధారణ, రక్తపోటు పరీక్షల శిబిరం” ను నిర్వాహకులు బీరే శ్రీరాములు ఆధ్వర్యంలో నిర్వహించారు. శిబిరం ను క్యాంపు నిర్వాహకులు బీరే శ్రీరాములు, ప్రణాలిక రూపకర్త సత్య నిర్ధరన్, కె.హెచ్. గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఎన్ ఎస్ ఎస్ యూనిట్ ప్రోగ్రాం అధికారి డా. బి.గోపాల్ నాయక్, మీ ఫౌండేషన్ శ్రీ కేత లోకేష్, అవతర్ మెహెర్ బాబా వృద్ధుల విద్యా శిబిరం సభ్యులు పి. సుజాత, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఎస్.అశోక్ రెడ్డి, ఆరోగ్య కార్య కర్త . బి. అరుణ లు శిబిరంలో తమ సహాయ సహకారాలను అందించారు. ఈకార్యక్రమంలో 120 మంది సభ్యుల రక్త గ్రూపు నిర్ధరణ చేయించుకోవడం జరిగింది.కార్యక్రమంలో డా. బి. గోపాల్ నాయక్ మాట్లాతు ధర్మవరం పట్టణంలోని ఎన్జీవోల సహకారం తీసుకొని వేసవి సెలవుల అనంతరం ధర్మవరంలో ప్రతి వార్జునందు ఏర్పాటు చేసే ప్రతి కార్యక్రమం లో ఎన్ఎస్ఎస్ యూనిట్ వాలంటీర్లు పాల్గొంటారని తెలియజేసారు. అనంతరం సన్మాన కార్యకమం లో
యస్. అశోక్ రెడ్డి ,బి. అరుణ గత 15 సంవత్సరాలనుండి వైద్య శిబిరాలలో విశేషమైన సేవలు అందించిన వారిని ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు,ఆదర్య సేవా సంఘం చెన్నప్రకాశ్ సన్మానించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు