విశాలాంధ్ర- ధర్మవరం ; ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అద్వైర్యంలో స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ధర్మవరం నందు స్కిల్ హబ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ప్రిన్సిపల్ జె.వి సురేష్ బాబు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి బి. హరి కృష్ణ తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇందులో ఈనెల 10వ తేదీ నుండి ఇంజనీరింగ్ టెక్నికల్ సపోర్ట్ కోర్సును ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఇందుకు ఇంటర్ పాస్, డిగ్రీ ,పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఆసక్తి కల్గిన యువతీ యువకులు నమోదు చేసుకోవలసిందిగా తెలిపారు. తదుపరి వివరాలకు 9182288465 నంబర్లకు లేదా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల యందు నేరుగా సంప్రదించాలని తెలిపారు.శిక్షణ అనంతరం వీరికి ఉద్యోగం అవకాశం కల్పించడం జరుగుతుందని తెలియచేసారు. నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా తెలిపారు.
ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులు.. ప్రిన్సిపాల్ సురేష్ బాబు
RELATED ARTICLES