Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఉచిత కంటి శిబిరముల కరపత్రాలు విడుదల..

ఉచిత కంటి శిబిరముల కరపత్రాలు విడుదల..

- Advertisement -

రోటరీ క్లబ్ అధ్యక్షు డు నాగభూషణ
విశాలాంధ్ర ధర్మవరం : ఈనెల 9వ తేదీ పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణంలో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) ఉదయం 7:00 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించే ఉచిత కంటి ఆపరేషన్ల శిబిరమును సద్వినియోగం చేసుకోవాలని తెలుపుతూ, వాటికి సంబంధించిన కరపత్రాలను రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగభూషణ, క్లబ్బు సభ్యులతో కలిసి పట్టణంలోని సాంస్కృతిక మండలి లో విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రోటరీ క్లబ్ కంటి శిబిరాలతో పాటు మరెన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ పట్టణ గ్రామీణ ప్రజలలో స్థిరస్థాయిగా మంచి గుర్తింపు పొందింది అని తెలిపారు. ఈ శిబిరం రోటరీ క్లబ్ తో పాటు శంకర కంటి ఆసుపత్రి బెంగళూరు, జిల్లా అంధత్వ నివారణ సంస్థ వారి సహకారంతో వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు గోరకాటి పుల్లన్న, గోరకాతి పెద్దారెడ్డి, వారి కుమారుడు కోడళ్ళు గోరకాటి ప్రమీలమ్మ గోరకాటి రఘునాథరెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరిస్తున్నారని తెలిపారు. బీపీ, షుగర్ ఉన్నవారు పరీక్షలు చేయించుకుని రావలెనని తెలిపారు. ఉచిత వైద్య చికిత్సలు, ఉచిత ఆపరేషన్, ఉచిత భోజనం, ఉచితంగా అద్దాలను కూడా ఇవ్వబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి పట్టణాలలో పల్లెలలో శిబిర విజయవంతముకు కృషి చేయాలని తెలిపారు. శిబిరానికి వచ్చువారు రేషన్ కార్డు లేదా ఓటర్ గుర్తింపు కార్డు రెండు జిరాక్స్ కాపీలు మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు , మూడు ఫోటోలు తప్పకుండా తీసుకొని రావలెనని తెలిపారు. ఈ కార్యక్రమంలో జి.హరినాథ్, వి.శివయ్య ఎం. చంద్రశేఖర్ పెద్దారెడ్డి వై సుదర్శన గుద్ధ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు