Homeజిల్లాలుఅనంతపురంకూరగానిపల్లిలో ఉచిత వైద్య శిబిరం…..

కూరగానిపల్లిలో ఉచిత వైద్య శిబిరం…..

- Advertisement -

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : మండల పరిధిలోని కూరగానిపల్లి గ్రామంలో వినాయక చవితి పండుగ సందర్భంగా మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎస్.వి.ఎస్ (SVS) హాస్పిటల్, ఆరాధ్య చిల్డ్రన్స్ హాస్పిటల్ సౌజన్యంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ ఆర్. రఘు రాములు (జనరల్ ఫిజీషియన్, క్రిటికల్ కేర్ నిపుణులు), డాక్టర్ జి. భాస్కర్ నాయుడు (పిల్లల వైద్య నిపుణులు – ఆరాధ్య చిల్డ్రన్స్ హాస్పిటల్), డాక్టర్ కె. మంజుల (స్త్రీల వైద్య నిపుణులు) గ్రామస్థులు, మహిళలు, చిన్నారులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వైద్య సలహాలు అందించారు. కార్యక్రమంలో భాగంగా సేవలందించిన వైద్యులను, హాస్పిటల్ సిబ్బందిని గ్రామ పెద్దలు, యువకులు మొక్కలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వైద్య సేవలు అందించిన వైద్య బృందానికి, నిర్వాహకులకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, యువకులు, మహిళలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు