శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం కమిటీ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని తొగటవీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయం లో శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో 110వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును నిర్వహిస్తున్నట్లు ఆలయ అభివృద్ధి సంఘం నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణానికి చెందిన ప్రముఖ డాక్టర్లచే ఈ శిబిరమును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరా దాతలుగా కీర్తిశేషులు దాసరి కేశమ్మ కీర్తిశేషులు దాసరి పెద్ద వెంకటేశ్వర్లు జ్ఞాపకార్థం వీరి కుమారుడు నారాయణస్వామి అండ్ సన్స్ దాసరి కమలాక్షి వారు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రముఖ వైద్యులు వివేకులాయప్ప, వెంకటేశ్వర్లు, సాయి స్వరూప్, సాయి శ్వేత, మధుసూదన్, విఠల్ లచే వివిధ జబ్బులకు వైద్య చికిత్సలను, ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా వివరించడం జరుగుతుందని తెలిపారు. కావున పట్టణము గ్రామీణ ప్రాంతాలలో గల పేద ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యమును పదిలంగా ఉంచుకోవాలని తెలిపారు.
ఈనెల 27న ఉచిత వైద్య చికిత్స శిబిరం..
RELATED ARTICLES