Homeఆంధ్రప్రదేశ్తాడిపూడి సొసైటీ అద్వర్యం లో  ఉచిత మెగా వైద్య శిభిరం

తాడిపూడి సొసైటీ అద్వర్యం లో  ఉచిత మెగా వైద్య శిభిరం

- Advertisement -

విశాలాంధ్ర – తాళ్లపూడి : తాళ్లపూడి మండలం లోని తాడిపూడి  సొసైటీ ఆధ్వర్యంలో అధ్యక్షులు నామ కొండబాబు ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిభిరాన్ని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మెగా ఉచిత వైద్య శిభిరాలు ఏర్పాటు చేయటం, కార్పోరేట్ ఆస్పత్రుల వైద్యులు పాల్గొనేకార్యక్రమలు చేపట్టడం పట్ల సొసైటీ అధ్యక్షలు కొండబాబును ఎమ్మెల్యే ముప్పిడి అభినందించారు. ఎన్డీయే ప్రభుత్వం లో పేద ప్రజల ఆరోగ్య భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నామని ఈ పదకం లో పొందలేని వైద్యసేవలకు సి.ఎం.రిలీఫ్ ఫండ్ నుంచి వారిని ఆదు కుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం లో  సొసైటీ అధ్యక్షులు నామ కొండబాబు స్వంతంగా కళ్ళ జోళ్ళు ఉచితం గా అందించారు.

*డ్రైన్ పనులకు భూమి పూజ:* ఎన్డీయే ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాతే అభివృద్ధి కి బాటలు వేస్తోందని, గత ప్రబుత్వం లో గ్రామాల్లో సైతం అభివృద్ధి కుంటూ పడిందని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరవు పేర్కొన్నారు. జెడ్పి నిధులు 15 లక్షలతో తాడిపూడి లో డ్రైన్ ల నిర్మాణానికి ఎమ్మెల్యే ముప్పిడి భూమి పూజ చేశారు. ఈ సందర్భన్గా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి విషయం ఎన్డీయే కూటమి ఒక విజన్ తో పనిచేస్తోందని అన్నారు. అనంతరం ఆయన సోసైటీ వద్ద ఏర్పాటు చేసిన ఉచిత వైద్య మెగా శిభిరం లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో కొవ్వూరు ఏ.ఎం.సి చైర్మన్ నాదెళ్ల శ్రీరామ్, టీడీపీ నాయకులు సిద్ధ దుర్గారావు, సొసైటీ కార్యదర్శి బొర్రా రామచంద్రం ఎండోమెంట్ ఈ.ఓ సూర్య ప్రకాష్, తాళ్లపూడి తహసీల్దార్ లక్ష్మి లావణ్య వివిధ గ్రామాల నుండి కూటమి నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు