ప్రిన్సిపాల్ సురేష్ బాబు
విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పా లిసెట్ ఉచిత శిక్షణా తరగతులు సజావుగా ప్రారంభం కావడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు ఈనెల 1వ తేదీతో ముగిశాయని, తద్వారా బుధవారం ఉచిత పోలిశెట్ శిక్షణా తరగతులకు వందమంది విద్యార్థులు పాల్గొనడం జరిగిందని తెలిపారు. అనంతరం ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ, గణితం అధ్యాపకులు హరిబాబు, మల్లికార్జున, ప్రదీప్ లు పా లిశెట్ పరీక్షకు సంబంధించిన పలు సూచనలు, పరీక్ష ప్రశ్న పత్రంపై వారు వివరించడం జరిగిందన్నారు. ఈ ఉచిత శిక్షణా తరగతులు ఏప్రిల్ రెండవ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు. శిక్షణలో అప్పుడప్పుడు స్లిప్ టెస్ట్ లు నిర్వహించబడునని, చివరి తేదీన మోడల్ టెస్ట్ పేపర్ ను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. తద్వారా ప్రవేశ పరీక్షల్లో విద్యార్థుల స్థాయి తెలుస్తుందని తెలిపారు. ఈ శిక్షణా తరగతులు పదవ తరగతి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. కావున ఆసక్తిగల పదవ తరగతి పరీక్షలు రాసిన వారు మా కళాశాలలో రావచ్చునని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థినీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రారంభమైన పాలిశెట్ ఉచిత శిక్షణ తరగతులు
RELATED ARTICLES