Wednesday, April 2, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపాలిసెట్ 2025 కు ఉచిత శిక్షణ.. ప్రిన్సిపాల్ సురేష్ బాబు

పాలిసెట్ 2025 కు ఉచిత శిక్షణ.. ప్రిన్సిపాల్ సురేష్ బాబు

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్ 2025 కు ఉచిత శిక్షణ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ బాబు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పదవ తరగతి పరీక్ష లు వ్రాసిన విద్యార్థులందరికి ఏప్రిల్ 2 వ తేదీ నుండి పాలిసెట్ కొరకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 30-4-25 వ తేదీ న పాలిసెట్ నిర్వహించ బడుతుందని, ఈ పరీక్ష కై ధర్మవరం పట్టణములో కూడా పరీక్ష కేంద్రాలున్నాయని తెలిపారు. పాలిసెట్ కొరకు ఆన్లైన్ లో వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చును అని తెలిపారు. పాలిసెట్ కు దరఖాస్తు చేసుకొన్న విద్యార్థులకు ప్రభుత్వ పాలిటెక్నిక్ ధర్మ వరం నందు అనుభవ జ్ను లైన అధ్యాపకులచే ఉచిత శిక్షణ ఇవ్వబడునని, శిక్షణ కాలం లో స్టడీ మెటీరియల్ కూడా ఉచితంగా అందజేయ బడుతుందని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు