Homeజిల్లాలుఅనంతపురంపెద్ద పాలమడలో ఉచిత పశువైద్య శిబిరం

పెద్ద పాలమడలో ఉచిత పశువైద్య శిబిరం

- Advertisement -

వందల సంఖ్యలో పశువులకు వ్యాధి నివారణ చర్యలు

విశాలాంధ్ర, తాడిపత్రి :మండల పరిధిలోని పెద్ద పాలమడ గ్రామంలో గురువారం డాక్టర్, ఏహెచ్ఏ, పశువైద్య సహాయకుల ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 17 పశువులకు వ్యాధి నివారణ, 2 పశువులకు గర్భకోశ నివారణ, 1 పశువుకు చూలు పరీక్ష నిర్వహించినట్లు పశువైద్యులు హరికృష్ణ తెలిపారు. అదేవిధంగా 22 పెద్ద పశువులకు, 15 చిన్న దూడలకు, అలాగే 3,252 గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు త్రాగించినట్లు చెప్పారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శుక్రవారం దిగువపల్లి గ్రామంలో కూడా పశువైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కావున పశువుల రైతులు, గొర్రె-మేకల యజమానులు ఈ ఉచిత పశువైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పశువుల రైతులు, గొర్రెలు-మేకల యజమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు