ఆలయ అడక్ కమిటీ చైర్మన్ చెన్నం శెట్టి జగదీష్ ప్రసాద్, ఆలయ ఈవో వెంకటేశులు
విశాలాంధ్ర ధర్మవరం : ప్రజా సంక్షేమం కోసమే ప్రతినెల పౌర్ణమి గరుడసేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఆలయ అడహక్ చైర్మన్ చెన్నం శెట్టి జగదీష్ ప్రసాద్, ఆలయ ఈవో వెంకటేశులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ ఆవరణ నందు పౌర్ణమి గరుడ సేవలను నిర్వహించారు. అనంతరం చైర్మన్ చెన్నం శెట్టి జగదీష్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతినెల ధర్మవరం పట్టణంలో తిరుమల తిరుపతి దేవస్థానములలో నిర్వహించే సాంప్రదాయ పద్ధతిలో ఇక్కడ ఈ గరుడ సేవలను నిర్వహిస్తున్నామని, దాతల సహాయ సహకారములతోనే చేపట్టడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తాదులు, పట్టణ ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమం కొరకే పౌర్ణమి గరుడసేవ కార్యక్రమాలు ..
RELATED ARTICLES