Friday, May 16, 2025
Homeజిల్లాలుకర్నూలుగద్వాల సోమన్న "సప్తతి" పుస్తకావిష్కరణ

గద్వాల సోమన్న “సప్తతి” పుస్తకావిష్కరణ

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు): మండల పరిధిలోని కంబదహాల్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పని చేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త ,బాలబంధు డా.గద్వాల సోమన్న 70వ పుస్తకం “సప్తతి” పుస్తకావిష్కరణ కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఆచార్య డా.దార్ల వెంకటేశ్వరరావు,శతాధిక పుస్తకాల ప్రచురణ కర్త డా.వైరాగ్యం ప్రభాకర్,తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డా.నామోజు బాలాచారి,విజిటింగ్ ప్రాపెసర్ డా కాంచనపల్లి గోవర్ధన్ రాజు చేతుల మీదుగా శుక్రవారం ఘనంగా జరిగింది.తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ,భవానీ సాహిత్య వేదిక సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన,శతాధిక కవుల సమ్మేళనంలో కవి గద్వాల సోమన్న పుస్తకావిష్కరణ జరగడం గమనార్హం.అనంతరం ఈ పుస్తకాన్ని శ్రీ కె. వి. నాగేశ్వరరావు కు అంకితమిచ్చారు. పుస్తక కృతికర్త గద్వాల సోమన్నను సాహితీమిత్రులు,ఉపాధ్యాయులు అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు