మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో స్వయం ఉపాధి సబ్సిడీ రుణాల దరఖాస్తుల పరిశీలనతో పాటు ఇంటర్వ్యూలు సజావుగా నిర్వహించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ, ఈ బీసీ, కమ్మ, రెడ్డి, ఆర్యవైశ్య ,బ్రాహ్మణ, కాపు, మేదర, కుమ్మర, కులాల కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి సబ్సిడీ రుణాలపై15 మంది బ్యాంకు అధికారుల ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. మొత్తం ఆన్లైన్లో 1900 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, 1172 మంది ఇంటర్వ్యూలకు హాజరు కావడం జరిగిందని తెలిపారు. విద్యా అర్హత, కుల ధ్రువీకరణ పత్రాలు, బర్త్ సర్టిఫికెట్, తదితర పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగిందని తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ఇంటర్వ్యూలు కొనసాగించడం జరిగిందని తెలిపారు. అర్హత లిస్టు త్వరలో బ్యాంకు అధికారులు ప్రకటించబడుతుందని వారు తెలిపారు.
సజావుగా జరిగిన రుణాల దరఖాస్తుల పరిశీలన, ఇంటర్వ్యూలు
RELATED ARTICLES