Wednesday, January 8, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఆలయమునకు వెండి కిరీటం బహుకరణ

ఆలయమునకు వెండి కిరీటం బహుకరణ

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని శ్రీనివాస నగర్ లో వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయమునకు ఈనెల 10వ తేదీ నిర్వహించబడే వైకుంఠ ఏకాదశి వేడుకలు సందర్భంగా దాతలైన విశాలాక్షి వజ్జల వెంకటరమణ బాబు అండ్ సన్స్ వారు స్వామివారికి వెండి కిరీటము, వక్షస్థల మహాలక్ష్మీ లను స్వయంగా చేయించి, ఆలయ అధ్యక్షులు చెన్నం శెట్టి జగదీశ్వర ప్రసాద్కు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు రాజేష్ ఆచార్యులు దాతల పేరిటన పూజలు, అర్చనలు నిర్వహించి, ఘనంగా సత్కరించారు. దాతలు మాట్లాడుతూ దైవ సంకల్పం లేనిదే మానవ ప్రయత్నాలు విజయవంతం కావని తెలిపారు. తనవంతుగా స్వామివారికి ఇలా కిరీటం ఇవ్వడం తన పూర్వజన్మ సుకృతముగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు