Wednesday, February 5, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిబాలికలకు చదువు, రక్షణ సంస్థలపై అవగాహన తప్పక ఉండాలి..

బాలికలకు చదువు, రక్షణ సంస్థలపై అవగాహన తప్పక ఉండాలి..

హెడ్మాస్టర్ మేరీ వర కుమారి
విశాలాంధ్ర ధర్మవరం:: బాలికలకు చదువుతోపాటు రక్షణ సంస్థలపై తప్పక అవగాహన కలిగి ఉండాలని హెడ్మాస్టర్ మేరీ వర కుమారి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని కొత్తపేటలో గల ప్రభుత్వ మునిసిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ బాలికల దినోత్సవం కార్యక్రమాన్ని బాలికలు, ఉపాధ్యాయుల నడుమ ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ మేరీ వర కుమారి బాలిక దినోత్సవం సందర్భంగా ఎన్నో విషయాలను వారు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బాలికలకు ఉన్న హక్కులపై పోరాడినప్పుడే తగిన న్యాయం జరుగుతుందని తెలిపారు. సమాజంలో బాలికలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని వాటి నుండి ధైర్యంగా బయటపడాలంటే ఒక్క చదువు మాత్రమే మార్గము అని తెలిపారు. బాలికలు చదువుకుంటే సాంఘిక వివక్ష లేకుండా ఆర్థిక స్వాతంత్రము, కుటుంబ పోషణ, సొంతంగా బ్రతకడం, ధైర్యంగా సమస్యను చెప్పడం లాంటివి అలవాటు చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా బాలికలకు ప్రభుత్వం కల్పించిన హక్కులు చట్టాలపై పూర్తిగా అవగాహన చేసుకున్నప్పుడే బాలికకు పూర్తి స్వాతంత్రం వచ్చినట్లు అవుతుందని తెలిపారు. అనంతరం కొంతమంది బాలికలు జాతీయ బాలిక దినోత్సవ సందర్భంగా మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థినీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు