Monday, February 24, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపేదలకు గ్రామ పట్టణాలలో ఇళ్ల స్థలాలు ఇవ్వండి..

పేదలకు గ్రామ పట్టణాలలో ఇళ్ల స్థలాలు ఇవ్వండి..

సిపిఐ నియోజక వర్గ కార్యదర్శి ముసుగు మధు
విశాలాంధ్ర ధర్మవరం;; నియోజకవర్గంలోని తాడిమర్రి మండలంలో పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ,పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇవ్వాలని, ఇల్లు కట్టుకునేందుకు ఐదు లక్షల డబ్బులు కూడా ఇవ్వాలని నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి మధు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాన డిమాండ్ తో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లిన వారితో అప్లికేషన్ రాయడం జరిగింది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కాటమయ్య, తాడిమర్రి మండలం వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు కాసేప్ప, లక్ష్మీనారాయణ, దాసు, సన్న పెద్దన్న, చౌడప్ప బత్తలపల్లి ,వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు సన్న పెద్దన్న ,నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ… గత వైసిపి ప్రభుత్వం హయాంలో పేదలకు గ్రామాల్లో ఇచ్చిన ఒకటిన్నర సెంట్లు, గాను మూడు సెంట్లుగా, పట్టణాల్లో 1 సెంటు రెండు సెంట్లుగా చొప్పున ఇళ్లస్థలాల పట్టాలు ఇవ్వాలన్నారు. ఇంటి నిర్మాణం కోసం నాలుగు లక్షల నుంచి పెరిగిన ధరల దృష్టిలో పెట్టుకుని ఐదు లక్షలకు పెంచాలన్నారు. 10 సంవత్సరాల కాలం పాటు నివాసముంటున్న ఇండ్లకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా పేద ప్రజలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని దరఖాస్తులు పూర్తి చేసి కలెక్టరేట్ కార్యాలయంలో ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పేదలకు న్యాయం చేసే విధంగా చర్యలు గైకొనాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు