Wednesday, March 12, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమా భూములు మాకు ఇప్పించండి బాధితుల ఆవేదన.. నిరసన

మా భూములు మాకు ఇప్పించండి బాధితుల ఆవేదన.. నిరసన

విశాలాంధ్ర- ధర్మవరం/ముదిగుబ్బ;; శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం మండలంలోని అడవి బ్రాహ్మణపల్లి తండా గ్రామ రైతులు మహిళలు కలిసి ముదిగుబ్బ తాసిల్దార్ కార్యాలయం ఎదుట మా భూములు తిరిగి మాకు ఇప్పించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ కబ్జా చేసిన మా భూములను తిరిగి మాకు ఇప్పించాలని, మండల పరిధిలోని అడవి బ్రాహ్మణపల్లి తాండ గ్రామ రైతులు ,మహిళలు సోమవారం సిపిఐ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ముదిగుబ్బ రెవెన్యూ కార్యాలయం ఎదుట ఆందోళన చేయడం జరిగిందన్నారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న మా భూములను మా ప్రాంతానికి సంబంధంలేని ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ మాకు తెలియకుండా మా భూములను, ఆయన పేరిట ఆయన బంధువుల పేరిట రికార్డుల్లో నమోదు చేయించుకుని స్వాహా చేశాడని వాపోయారు, ఈ నేపథ్యంలో ఇటీవల ఈ విషయమై సిపిఐ పార్టీ రాష్ట్ర నాయకులు రామకృష్ణ మా గ్రామానికి వచ్చి ఈ భూముల కబ్జా గురించి పై అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది అని, దీంతో రెవెన్యూ ఉన్నతాధికారులు రెండు రోజులు పాటు మా గ్రామంలో ఈ భూములను తూతూ మంత్రంగా పరిశీలన చేసి, నేటికీ ఎటువంటి ఎంపీపీ పై చర్య తీసుకోలేదని తాసిల్దార్ నారాయణస్వామితో తీవ్రస్థాయిలో వాగ్వివాదం చేయడం జరిగిందన్నారు.ఏపీ పల్లి తండాలో కబ్జాకు గురైన గిరిజన రైతుల భూములను రెవెన్యూ అధికారులు తిరిగి వారికి ఇప్పించకపోతే త్వరలోనే ఆ రైతులతో కలిసి పెద్ద ఎత్తున నిరంతర ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు హెచ్చరించారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేదలకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే దాన్ని విచారణ చేయించాల్సింది పోయి ఆయన పైన ధర్మవరం బిజెపి నాయకులు హరీష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దారుణమని ముదిగుబ్బ సిపిఐ మండల కార్యదర్శి శ్రీనివాసులు ఆరోపించారు, ఇప్పటికైనా ఈ విషయమై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ తక్షణమే ఈ భూమల కబ్జాపై ఐఏఎస్ అధికారులతో విచారణ చేయించి, ఎంపీపీ వలన భూములు కోల్పోయిన గిరిజన రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాధిత గిరిజన రైతులతో పాటు స్థానిక సిపిఐ నాయకులు తిప్పయ్య, గంగిరెడ్డిపల్లి నాయుడు, లింగుట్ల వెంకటరాముడు, రాధాకృష్ణ, ముత్తులూరి మధు, అమిలినేని రామంజి, కొండయ్య , బావయ్య, తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు