నిన్న ఒక్క రోజే రూ. 1,300 పెరిగిన ధర
దేశీయ మార్కెట్లో 10 గ్రాముల ధర రూ. 89,400కు చేరిక
లక్ష రూపాయలకు చేరుకున్న కిలో వెండి ధర
గత కొన్ని రోజులుగా బంగారం ధర నేల విడిచి ఆకాశం దిశగా పయనిస్తోంది. దేశీయ మార్కెట్లో నిన్న తొలిసారి 10 గ్రాముల బంగారం ధర రూ. 89 వేల మార్కును దాటేసింది. నిన్న ఒక్క రోజే రూ. 1,300 పెరగడంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 89,400కు చేరుకుంది. ఈ నెల ప్రారంభంలో రూ. 85 వేల మార్కును తాకిన పసిడి ధర 15 రోజుల్లోనే రూ. 90 వేలకు చేరువకావడం గమనార్హం. హోల్‌సేల్, రిటైల్ నగల వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడమే ధరల పెరుగుదలకు కారణమని బులియన్ వర్గాలు చెబుతున్నాయి. ఇక, హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 87,160గా ఉంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ. 79,900కు చేరుకుంది. ఇక వెండి ధర కూడా నిన్న కిలోకు రూ. 2 వేలు పెరగడంతో 4 నెలల గరిష్ఠాన్ని తాకుతూ లక్ష రూపాయలకు చేరుకుంది.