మొక్కలు నాటిన వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ ఎస్ మాణిక్యరావు
విశాలాంధ్ర -అనంతపురం : ప్రతినెల మూడవ శనివారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక కార్యక్రమం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల అనంతపురంలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ మాణిక్యరావు అధ్యక్షతన ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ను ఉద్దేశించి ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ మాణిక్యరావు మాట్లాడుతూ… ఈ రాష్ట్రం మనకేమిచ్చిందని కాదు మనం ఈ రాష్ట్రానికి ఏమి ఇచ్చాము అని ప్రతి ఒక్కరూ ఆలోచించి, స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర సాధనకి ప్రతి వైద్య విద్యార్థి పాటుపడాలని తెలిపారు. మన పరిసరాలతో పాటు చుట్టూ ఉండే పరిసరాలను సామాజిక బాధ్యతతో పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆరోగ్యం పట్ల, పరిశుభ్రత పట్ల అవగాహన కార్యక్రమాలను సమాజంలోని ప్రజలందరికీ అందించాలని తెలిపారు. తర్వాత ఎన్ ఎస్ ఎస్ స్మృతి వనం పార్కులో వైద్య విద్యార్థులతో కలిసి ప్రిన్సిపాల్ చీపురు చేతబట్టి పరిసరాలను శుభ్రపరిచారు. తర్వాత జామ ,సపోటా తదితర మొక్కలను విద్యార్థులతో కలిసి నాటారు. అలాగే ఎలక్ట్రికల్ వ్యర్థ పదార్థాలను వివిధ షాపులు ఇళ్ల నుంచి సేకరించి రీసైకిలింగ్ కి ఇవ్వాల్సిందిగా విద్యార్థుల ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ లు ఆచార్య డాక్టర్ శంషాద్ బేగం, ఆచార్య డాక్టర్ సరళ, అనాటమీ ప్రొఫెసర్ ఆచార్య డాక్టర్ ఎస్ ఉమామహేశ్వరరావు, ఇతర వైద్యులు డాక్టర్ షబానా, డాక్టర్ రేణుక, డాక్టర్ సహజీర్, డాక్టర్ పునర్జీవన్ కుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఆదిరెడ్డి పరదేశి నాయుడు, ఫిజికల్ డైరెక్టర్ నరసింహ నాయక్, శానిటేషన్ సూపర్వైజర్ హరీష్ , పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థులు, మెడికల్ విద్యార్థులు పాల్గొన్నారు.